రాయదుర్గం: విద్యుత్ కోతలపై గొడిశలపల్లి సబ్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి రైతుల ఆందోళన
విద్యుత్ కోతలు రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో బాదనహాల్ సహా పలుగ్రామాల రైతులకు గత నాలుగైదు రోజులుగా సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ ఆదివారం అర్ధరాత్రి సబ్ స్టేషన్ ముట్టడించారు. విద్యుత్తు అధికారులను నిలదీశారు. పంటలు ఎండిపోతుంటే మీరు కరెంట్ ఆపేస్తునానారంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులు తక్షణమే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.