రాయదుర్గం: మండలంలోని 12 ఎంపిటిసి స్థానాలు గెలుచుకుంటాం : టిడిపి మండల కన్వీనర్ కురుబ హనుమంతు
రాయదుర్గం మండలంలోని జెడ్పిటిసి సహా 12 కు 12 ఎంపిటిసి సీట్లు, తెలుగుదేశం పార్టీ గెలుచుకుని ఘన విజయం సాదిస్తామని టిడిపి మండల కన్వీనర్ కురుబ హనుమంతు ధీమా వ్యక్తం చేశారు. రాయదుర్గం ఎంపిడిఓ కార్యాలయంలో వడ్ర హొన్నూరు ఎంపిటిసి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కెంచానపల్లి, జుంజురాంపల్లి స్థానాలకు పార్టీ అభ్యర్థుల నేమినేశన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ అభ్యర్థిగా జుంజురాంపల్లి కి చెందిన ఎం.తేజశ్విని పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆశీస్సులతో మండలంలోని అన్ని స్థానాలు గెలుచుకుంటామని, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.