రాయదుర్గం: గుమ్మగట్ట మండలంలో విస్తృతంగా పర్యటించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
గుమ్మగట్ట మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. తాళ్లకెర గ్రామంలో 6వదశలో చేపట్టిన రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రీసర్వే పక్కాగా ఉండాలని, పనులు వేగవంతంగా చేపట్టాలని, గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టును పరిశీలించారు. బిటి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. గుమ్మగట్ట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పురోగతి, రీసర్వే పనులపై సమీక్షించారు.