రాయదుర్గం: పేదలకు పట్టాలు ఇచ్చేదాకా ఉద్యమం కొనసాగిస్తామని :సిపిఐ
అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేదాకా ఉద్యమం కొనసాగిస్తామని సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున స్పష్టం చేశారు. కణేకల్ లో ఇళ్ల స్థలాల కోసం ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం దీక్ష శిభిరంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి పేదలపట్ల కనికరం లేదని మండిపడ్డారు. సర్వే నెంబర్ 40, 41 లో తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.