రాయదుర్గం: పట్టణంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువును కంపచెట్ల మద్య పడేసిన అమానవీయ ఘటన
అప్పుడే పుట్టిన నవజాత శిశువును కంపచెట్ల మధ్య పడేసిన అమానవీయ ఘటన రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దారిలో వెళ్తున్న స్థానికులు శిశువును గమనించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. అయితే శిశువు బతికి ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.