యర్రగొండపాలెం: వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన 10 కుటుంబాలు
యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ. పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.