నారాయణపేట్: ఉడుమల్ గిద్ధ గ్రామంలో 13 సీసీ కెమెరాల ఏర్పాటు: నిఘా నీడలో గ్రామం
దామరగిద్ద మండలం ఉడుమల్ గిద్ధ గ్రామంలో శాంతిభద్రతల కోసం 13 సీసీ కెమెరాలను డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రారంభించారు. నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ఈ కెమెరాలు కీలకంగా మారనున్నాయని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.