నారాయణపేట్: తెలంగాణలో 7వ రోజుకు చేరిన ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల రిలే దీక్షలు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ఎన్.హెచ్.ఏం ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. నిరసనలో భాగంగా గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల్లో అభద్రతను తొలగించి, తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.