గిద్దలూరు: గిద్దలూరు లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ అడుగుజాడలే అందరికీ ఆదర్శమని అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని గడగడలా నుంచి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని జాయింట్ కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.