రాయదుర్గం: వైసిపి నేతలకు ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు సవాల్
*రాయదుర్గం నియోజకవర్గం* *అనంతపురం జిల్లా* *ఐదేళ్లు అరాచక పాలన చేసి ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నారు? : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు* *రాయదుర్గం:* ఐదేళ్ల పాటు అరాచక పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఆదివారం రాయదుర్గం పట్టణంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాయదుర్గం మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రజలకు చేసిన మేలేమిటో ఒక్కటైనా చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.