రాయదుర్గం: రాయదుర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలి :ఎమ్మెల్యే
రాయదుర్గం రూరల్ ను కరువు మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు రాయదుర్గం మండలంలో 311.3 మి.మీ సాధారణ వర్షానికి 144.4 మి.మీ మాత్రమే కురిసి 53% లోటు ఏర్పడిందని, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు వర్షం లేక పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో జెడి సాల్ రెడ్డితో సమీక్షించి, కరువు మండలంగా ప్రకటించేలా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.