సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
చీమకుర్తి పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులు శుక్రవారం ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హింస వద్దు... అహింసే ముద్దు అంటూ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా చీమకుర్తి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు జవహర్ మాట్లాడుతూ... విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడంతోపాటు గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.