యర్రగొండపాలెం: దోర్నాల ఆసుపత్రిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్
దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజీ, నేత్ర వైద్య విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించడం పట్ల పారిశుధ్య కార్మికులను అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు