నారాయణపేట్: ఊట్కూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి: చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్
నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం వల్ల ఊట్కూర్ గ్రామానికి ముంపు ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మక్తల్–నారాయణపేట రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.