మచిలీపట్నం: మచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా మచిలీపట్నం చిలకలపూడిలో గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్య సాధన, పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.