రాయదుర్గం: విద్యుత్ కోతలపై గుమ్మఘట్టలో సిపిఐ నాయకుల ఆందోళన
విద్యుత్ కోతలతో ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు మండిపడ్డారు. 9 గంటల విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా భూపాసముద్రం సబ్ స్టేషన్ లో 8 గంటలే ఇస్తున్నారని సిపిఐ నాయకులు కొట్రేష్, తిప్పేస్వామి తెలిపారు. సోమవారం రైతులతో కలిసి గుమ్మగట్ట ఏఈ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఏఈకి వినతి ఇచ్చారు. మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎండుతున్నాయని, 48 గంటల్లో పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.