కొండపి: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం: స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అతి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై పోలీసు సిబ్బందితో ఎస్పీ హర్షవర్ధన్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా నేరాలకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని రౌడీషీటర్లను ఎప్పటికప్పుడు మోనేటర్ చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలానే సమాసాత్మకమైన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కేంద్రాలను మార్పు చేయడం లేదంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటివి దృష్టి పెట్టాలన్నారు.