కొండపి: రాష్ట్రంలో శాంతిభద్రతల లోపించాయని వైసిపి కొండపి మాజీ వైసీపీ ఇన్ ఛార్జ్ మాదాసి వెంకయ్య తీవ్ర విమర్శల
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని YCP కొండపి మాజీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య విమర్శించారు. ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరుగుమల్లి బీసీ బాలికల వసతి గృహం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బాలికల భద్రతపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.