రాయదుర్గం: పట్టణంలో యువకుడు ఆత్మహత్య
రాయదుర్గం పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ దేవానంద్ వివరాల మేరకు మల్లాపురం లేఅవుట్ లో నివసిస్తున్న మంజు అనే ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు *"నా చావుకు ఎవరూ కారణం కాదు"* అంటూ సెల్ఫీ వీడియో తీసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మంజు ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పని చేయకుండా ఉంటే ఎలా పెళ్లి చేయాలని తల్లి మందలించినట్లు, అటు యువతి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి అంగీకరించలేదని సమాచారం.