రాయదుర్గం: బేలోడు గ్రామంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
గుమ్మగట్ట మండలంలోని బేలోడు సహా వివిధ గ్రామాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం బేలోడు గ్రామంలోని మారెమ్మ దేవి ఆలయంలో అమ్మవారికగ సిద్ది ధాత్రి సరస్వతి అలంకారం చేసి భక్తిశ్రద్దలకు దర్శనం కల్పించారు. రోజు ఒక అలంకారంతో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక శోభతో గ్రామం మారుమోగింది.