రాయదుర్గం: పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిత్రపట ఊరేగింపు
మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గంలో నడవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తాయి శేఖర్ పిలుపునిచ్చారు. గాందీ జయంతి సందర్భంగా శుక్రవారం రాయదుర్గం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాందీ చిత్రపట ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస మార్గంలో ప్రజలందరూ నడవాలని కోరారు.