దర్శి: దర్శి పట్టణంలో ఒకసారిగా ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఉన్నట్టుండి వీచిన గాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగులు పడే అవకాశం ఉందని బయటకు ఎవరు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజల మొబైల్ హెచ్చరిక సందేశాలు పంపారు.