రాయదుర్గం: ప్రశాంతంగా ఎంపిటిసి నామినేషన్లు : ఆర్డీఓ వసంతబాబు
ఎంపిటిసి నామినేషన్ల ప్రక్రియ రాయదుర్గం నా ప్రశాంతంగా జరుగుతోందని కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు తెలిపారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ను తనిఖీ చేశారు. సి సి కెమెరాల పర్యవేక్షణ, పోలీసు అధికారుల బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చన్నారు. రాయదుర్గం అర్బన్ సిఐ దేవానంద్, ఎంపిడివో కొండన్న పాల్గొన్నారు.