సంతనూతలపాడు: చీమకుర్తిలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో చోరీ: 10 వేల నగదు అపహరణ
చీమకుర్తి మండలం ఏలూరు వారి పాలెంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి, హుండీలో ఉన్న రూ. 10 వేల నగదును దుండగులు దోచుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు అర్చకులు హరి ప్రసాద్ తెలిపారు.