యర్రగొండపాలెం: గొల్లపల్లి జడ్పీహెచ్ పాఠశాలలో రసాభాసగా మారిన ఎస్ఎంసి ఎన్నికలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి జెడ్పిహెచ్ పాఠశాలలో ఎస్ఎంసి కమిటీ ఎన్నికలు రసాభాసగా మారాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ఎన్నికల్లో తలపడ్డాయి. ఎన్నికల విషయంలో మాట మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి బయటికి పంపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.