గిద్దలూరు: గిద్దలూరులో ఎన్డీయే కూటమి కీలక సమావేశం: ఎన్నికల వ్యూహాలపై నేతల దిశానిర్దేశం
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కార్యాలయంలో ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.