దర్శి: తాళ్లూరు మండలంలోని కస్తూర్బా విద్యాలయం, పాఠశాలల్లో తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, శివరాంపురంలో పాఠశాలలో మిడ్ డే మీల్స్ ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు భోజనాన్ని కూడా అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కోడిగుడ్లు సరిగా ఉండడం లేదని విద్యార్థులు చెప్తున్నారని మంచివి అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో రాజు పడేది లేదని స్పష్టం చేశారు.