రాయదుర్గం: పట్టణంలో భక్తిశ్రద్దలతో సామూహిక వర మహాలక్ష్మి వ్రతం ఆచరించిన రాజరాజేశ్వరి మహిళా మండలి సభ్యులు
రాయదుర్గం పట్టణంలోని శ్రీ హాటకేశ్వర స్వామి దేవాలయం, స్వకుల సాలి సమాజ సత్రంలో శ్రీ రాజరాజేశ్వరి మహిళా మండలి ఆధ్వర్యంలో సామూహిక వర మహాలక్ష్మి వ్రతం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రత సందర్భంగా అర్చకులు కరణం రమేష్ స్వామి వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానాన్ని, పూజా విశిష్టతను భక్తులకు వివరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేసి, మంగళ హారతి నిర్వహించారు. సువాసినులు కొత్త చీరలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించి సుమంగళీ ప్రాప్తి కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షులు విమల, గౌరవ అధ్యక్షులు సునంద పాల్గొన్నారు.