రాయదుర్గం: యూనియన్ బ్యాంక్ లో క్రాప్ లోన్ మంజూరు చేయడానికి రైతుల నుంచి లంచం డిమాండ్ చేసిన సిబ్బంది, రైతుల ఆగ్రహం
క్రాప్ లోన్ చేయడానికి బ్యాంక్ అధికారి ఒకరు లంచం డిమాండ్ చేసినట్టు రాయదుర్గం మండల నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ కు ఈ మేరకు సిబ్బంది తీరుపై రైతులు పిర్యాదు చేశారు. లంచం డిమాండ్ చేసిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.