రాయదుర్గం: పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివి : రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్
*రాయదుర్గంలో పోలీసు అమరవీరులకు క్యాండిల్ లైట్ ర్యాలీతో నివాళి* రాయదుర్గం: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అర్బన్ సీఐ దేవానంద్ అన్నారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి R&B గెస్ట్ హౌస్ వరకు ఎస్ఐ సురేష్, KTS ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS, NCC విద్యార్థులతో కలిసి ర్యాలీ చేసి మానవహారం ఏర్పాటు చేసి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రజలు సుఖంగా ఉండేందుకు సైనికులు, పోలీసులు ప్రాణాలు అర్పించారని, వారి కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో NSS PO నారాయణ, NCC CTO గోవర్ధన్, కోదండరాములు పాల్గొన్నారు.