సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద కారును ఢీకొన్న లారీ, తప్పిన ప్రమాదం
మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద బుధవారం లారీ- కారు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్తున్న లారీ ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే కారును ఢీకొంది. అయితే కొంత దూరం వరకు కారును లారీ ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. రెండు వాహనాలు ఓవర్టేక్ చేసుకునే క్రమంలో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.