కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు
మతసామరస్యాలకు ప్రతీక అయినటువంటి మొహరం వేడుకలు ఆదివారం కొత్తగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి పీర్లను చివరి రోజు అయినటువంటి పదవరోజు పట్టణంలోని ఎంజీ రోడ్డు నందు ఊరేగింపుగా తీసుకువచ్చారు. నిర్వాకులు ఈ నేపథ్యంలో హిందూ, ముస్లింలనే తేడా లేకుండా భక్తులు పీర్లను దర్శించుకున్నారు. అనంతరం కానుకలు సమర్పించారు.