కొత్తగూడెం: 3,928 మందికి కొత్త పెన్షన్ల మంజూరు - పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం నియోజకవర్గంలో 3,928 మంది లబ్ధిదారులకు కొత్తగా సామాజిక భద్రత పెన్షన్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 30 వేల మందిని అర్హులుగా గుర్తించామని, వారికి దశలవారీగా పెన్షన్లు అందిస్తామని ఆయన వెల్లడించారు.