రాయదుర్గం: కాశీపురం క్రాస్ వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమం
రాయదుర్గం మండలం కాశీపురం క్రాస్ వద్ద అనంతపురం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు కళ్యాణదుర్గం వైపు నుంచి రాయదుర్గం వస్తున్న బొలెరో, కాశీపురం వైపు నుంచి వస్తున్న బైక్ డీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న రాంచర్, అభిరామ్, గోపాల్ అనే టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన వారు. గుండ్లపల్లి హైస్కూల్ లో వీరు టెన్త్ చదువుతున్నారు. కాశీపురంలో మిత్రుడి దగ్గర కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.