కోటవురట్ల: కోటవురట్ల మండలంలో 60 ఏళ్ల చరిత్రను తిరగరాశాం: హోం మంత్రి వంగలపూడి అనిత
కోటవురట్ల మండల స్థానిక ఎన్నికల్లో కొత్త రికార్డు సృష్టించామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లిలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి పార్టీల సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని, ఇకపై అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.