కైలాసపట్నం అగ్నిప్రమాదంలో గాయపడిన మరోక వ్యక్తి శనివారం మృతి, పదికి పెరిగిన మృతుల సంఖ్య
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నంలో గత ఆదివారం జరిగిన బాణాసంచా తయారీ కర్మాగారం ప్రేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి శనివారం విశాఖలో మృతి చెందాడు. దాంతో మృతుల సంఖ్య పదికి పెరిగింది. మరో ఆరుగురు ఇంకా ఆసుపత్రిలోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.