రాయదుర్గం: పట్టణ శివారులోని గజ లక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు
రాయదుర్గం పట్టణ శివారులోని మల్లాపురం లేఅవుట్ వెలసిన గజ లక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో గంగపూజ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.