రాయదుర్గం: విద్యుత్ స్థంభానికి అమర్చిన కేబుల్ నెట్వర్క్ బాక్స్ నుంచి మంటలు స్థానికులు భయాందోళన
రాయదుర్గం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి ఏరియాలో విద్యుత్ స్తంభానికి అమర్చిన ఫైబర్ నెట్ బాక్స్ నుంచి మంటలు రావడంతో స్థానికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం వైర్లు షార్ట్ అయి మంటలు వచ్చాయి. దీంతో కేబుల్ వైర్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వైర్లు దగ్దమవుతుండగా గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. అయితే సమాచారం అందుకున్న కేబుల్ నెట్వర్క్ నిర్వాహకులు ఈ సంఘటనకు కారకాలేంటని విచారం చేస్తున్నారు.