దర్శి: తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఒకసారి గా తేలికపాటి వర్షం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో తేలికపాటి వర్షం పడింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వాతావరణం లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకసారిగా ఆకాశంలో మేఘాలు ఆవృతమై తేలకపాటి వర్షం పడింది. పంటల సాగు కొరకు తగిన వర్షపాతం నమోదు కావడం లేదని రైతులు చెప్తున్నారు.