తరిగొప్పుల: జనగాం జిల్లాలో అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
జనగాం జిల్లా తరిగొప్పులలో అప్పుల బాధతో ఎర్ర అశోక్ (34) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ నిర్వహణ కోసం చేసిన రూ.6 లక్షల అప్పు తీర్చలేక మనస్తాపంతో అశోక్ ఉరేసుకుని మృతిచెందాడు. భార్య దివ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.