జనగాం: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన జనగామ క్రీడాకారిణులు
ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జనగామకు చెందిన సమన్విత, చామంతి పతకాలు సాధించారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా మధ్యప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికయ్యారు.