జనగాం: జనగామలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలు
జనగామ జిల్లా కలెక్టరేట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు అదనపు కలెక్టర్ బెన్షాలోం పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.