బచ్చన్నపేట: జనగామ జిల్లాలో బావిలో పడ్డ కారు: ప్రాణాలతో బయటపడిన భార్యాభర్తలు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రశాంత్ తన భార్యను కారులో నుంచి బయటకు నెట్టడంతో ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. గ్రామస్తులు, ఉపసర్పంచ్ ఉమేష్ చంద్ర సహాయంతో ప్రశాంత్‌ను కూడా సురక్షితంగా రక్షించారు.