డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం: రైలు కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు
డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి మధ్యప్రదేశ్‌కు చెందిన నరేన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. 108 సిబ్బంది అతడిని మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.