డోర్నకల్: ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ఈరోజు ఉపముఖ్యమంత్రి తో పాటు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు దామోదర్ రాజనర్సింహ గారిని వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశం స్నేహపూరిత,గౌరవపూర్వక వాతావరణంలో జరగగా పరస్పర శుభాకాంక్షలు మార్పిడితో పాటు రాష్ట్ర శాసన వ్యవస్థలో కొనసాగుతున్న సామరస్యాన్ని ప్రతిబిమించేలా ఈ సమావేశం జరిగిందని పేర్కొన్నారు .