డోర్నకల్: డోర్నకల్ లో విషాదం మున్నేరులో స్నేహితులతో కలిసి సరదాగా విహరించేందుకు వచ్చి ,రైల్వే ఉద్యోగి నీట మునిగి మృతి
డోర్నకల్ మున్నేరులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహరించేందుకు వచ్చిన రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎర్రంశెట్టి సందీప్ (32) అనే రైల్వే గార్డు మున్నేరుకు స్నేహితులతో వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.