డోర్నకల్: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ,డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన దోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ గారు, సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై పెట్టిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు, శాసనసభ గౌరవానికి తగిన విధంగా పనిచేస్తానని డాక్టర్ నాయక్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ నాయక్‌ను అభినందిస్తూ, డిప్యూటీ స్పీకర్‌గా ఆయనకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.