చిత్తూరు: అమరరాజా గ్రూప్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
అమరరాజా గ్రూప్ ఆధ్వర్యంలో డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్.వి. అరవింద్ కంటి ఆసుపత్రి సహకారంతో 150 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్ళద్దాలను పంపిణీ చేశారు. రహదారి భద్రత, డ్రైవర్ల ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.