చిత్తూరు: మోటకంపల్లి వద్ద కారు ఢీకొని వృద్ధుడు అక్కడికక్కడే మృతి
రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పూతలపట్టు మండలం మోటకంపల్లి గ్రామ సమీపాన జరిగింది గ్రామానికి చెందిన బాలకృష్ణ నాయుడు 80 సం రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కారు అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది