సంతనూతలపాడు: నాగులప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై శిక్షణ
నాగులుప్పలపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి ఉషారాణి మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారం చిన్నారులకు, బాలింతలకు, గర్భవతులకు క్రమం తప్పకుండా అందించాలన్నారు. కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడకుండా తిరిగి వాటిని అప్పగించాలన్నారు.